Thursday, August 24, 2006

మహిళలతోనే తెలుగు పదిలం

ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు రాసిన ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం ఇది। వాడుక తెలుగు భాషకి అసలైన చిరునామా ఆడవాళ్లేనని ఆవిడ అభిప్రాయం। నిజమే,dsl మా అమ్మ, పెద్దమ్మలు, పిన్నులు వాడినన్ని తెలుగు పదాలు, సామెతలు మగవాళ్లు వాడగా నేను వినలేదు। వాళ్లు మాట్లాడే అంశాలు కూడా ఇందుకు ఒక కారణమే।ఇదే విషయాన్ని ఆవిడ ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి మాటలను ఉదహరిస్తూ చక్కగా రాశారు।
"
ఒకప్పుడు ఆడవాళ్లు మాట్లాడే తెలుగుభాష అందంగా, అమృతప్రాయంగా ఉండేదనీ, సహజమైన నుడికారపు తెలుగును తాను ఆడవారి దగ్గరే నేర్చుకున్నాననీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వక్కణ। తన వ్యావహారిక భాషకు వాడీ వేడీ స్త్రీల పలుకుబడుల నుండే సంక్రమించాయంటారు ఆయన సగౌరవంగా - వారి 'అనుభవాలూ జ్ఞాపకాలూ' లో"

ఈ పుస్తకాన్ని నేను ఇదివరకే చదివాను। ఆనాటి సాంఘిక పరిస్థితులకి చక్కగా అద్దంపడుతూ, వ్యావహారిక, సంభాషణా తెలుగు భాష అంటే అమితమైన అభిమానం చూపించే ఒక తెలుగు రచయిత జీవిత గాథ అది।

పిల్లలు తల్లులతోటే తమ తొలినాళ్లు ఎక్కువ గడుపుతారు కాబట్టి, పిల్లలపై వారి భాష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం। అయితే, మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో తల్లులే సరైన తెలుగు మాట్లాడలేక పోతే, పిల్లలు ఇంకా త్వరగా మంచి భాషకి దూరమయ్యే అవకాశం ఎక్కువ। ఈ అభిప్రాయాన్ని వ్యాసం comments లో ఒకరు రాశారు।

ఇక వ్యాసంలో చివరగా ఆవిడ రాసిన వాక్యాలు
"
జాతీయమైన తెలుగుభాషను స్త్రీలు ప్రయోగించడమే కాదు, పరిరక్షించాలి కూడా! ఇప్పటికీ భాష, వేషం వారి చేత్లుల్లో చేతల్లో ఉన్నాయి కనుక। ప్రస్తుత తెలుగు స్త్రీలకు ఇది అతి ముఖ్యమైన బాధ్యత"

PS: ఈ సైట్ dynamic fonts వాడుతోంది. Use the padma extension for Firefox or use IE.

Tuesday, August 22, 2006

హైదరాబాదు - వికిపీడియా

హైదరాబాదు గురించి వికిపీడియాలో ఉన్న ఎంట్రీ ఇది.

ఇందులో రాసిన కొన్ని interesting విషయాలు:


* హుస్సేన్ సాగర్ 1562 లో నిర్మించారు.
* నిజాముల ఏలుబడిలోని హైదరాబాదు, భారత్‌లోని అన్ని సంస్థానాల కంటే పెద్దది. ఇంగ్లండు, స్కాట్లండు ల మొత్తం వైశాల్యం కంటే పెద్దది.
* నగరం 100 వార్డులుగా విభజింపబడి ఉంది.
* హైదరాబాదు నగరానికి లోక్‌సభ లో రెండు సీట్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లో పదమూడు సీట్లు ఉన్నాయి.

కానీ references లేకపోవటం అనేది కొంచెం పెద్ద సమస్య. తెలుగు వికిపీడియాలో ఎక్కువమంది రాయకపోవటం వల్ల ఇలా జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికీ reference పెడితే నమ్మకం పెరుగుతుంది. వికిపీడియాలో రాసే కొద్దిమందైనా అలా రాస్తే బాగుంటుంది.

టైపింగ్ తప్పులు కూడా చాలా ఉన్నాయి. వికీలు రాయకపోయినా, యూనికోడ్ తెలుగు టైప్ చెయ్యగలవాళ్లు కనీసం అప్పుడప్పుడూ తెలుగు వికిపీడియాలో ఇలాంటి తప్పులు ఏరిపారెయ్యటం, references పెట్టటం లాంటి పనులు చెయ్యాలి.

Monday, August 21, 2006

కాకతీయ యుగము

ఇది ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి రచన, ప్రపంచ తెలుగు మహాసభ ప్రచురణ.
చాలా సరళమైన భాషలో ఉంటుంది.

ఇక్కడ download చేసుకోవచ్చు.

మన తెలుగు చరిత్రలో చెప్పుకోదగ్గ అతికొద్ది గొప్పసామ్రాజ్యాలలో కాకతీయులది చాలా ముఖ్యమైనది. అదీ కాక, కాకతీయులైన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అందరికీ తెలిసినవాళ్లే.

చిన్న excerpt:

"
కాకతీయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
-----------------
1) కాకతీయులు తెలుగుదేశాన్ని సుమారు 325 సంవత్సరాలు (1000 AD - 1323 AD) పరిపాలించారు.

2) 225 BC - 225 AD మధ్యలో తెలుగుదేశాన్నే గాక దక్షిణాపథంలో విస్తారమైన భాగాన్ని పాలించిన శాతవాహనులకన్నా, 625 AD -1075 AD మధ్యలో వేంగీదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులకన్నా కాకతీయులు మనకు బాగా సన్నిహితులు."

ఎలుగుతోలు తెచ్చి...

ఈ article తమిళనాడులో ఉన్న తెలుగువారు, అక్కడ మాట్లాడే రకరకాల యాసలు - వీటి గురించి. ఇవి కాక, ఈ అయిదు పేజీల్లో ఉన్న nostalgia కోసమన్నా చదవొచ్చు. ఒక చిన్న excerpt:

"తరువాత ఎత్తయిన బృహదీశ్వరాలయ గోపురాన్ని చూస్తూ పొలం గట్ల మీద పోతున్నప్పుడు, 'అబయా! ఈ కావేటి నుంచి ఉత్తరంగా బయిదేలితే ఉత్తరపెన్న వరకూ మన గుంపు ఉండాది. ఉత్తరపెన్నకు ఉత్తరంగా, కావేటికి దక్షిణంగా మనవాళ్లు ఎవురూ ఉండరు. ఈ రెండు నదుల నడుమ భాగాన్ని మన పెద్దోళ్లు సౌకర్యం కోసం మూడు భాగాలు చేసుకొన్నారు. కావేటికీ దక్షిణ పెన్నకు నడాన ఉండేది తెన్నాడు అంటే దక్షిణదేశం. దక్షిణ పెన్నకు కుశస్థలికి నడానుండేది నడునాడు అంటే మధ్యప్రదేశ్, కుశస్థలికి ఉత్తరపెన్నకు నడానుండేది వడనాడు అంటే ఉత్తరదేశం. ఈ మూడునాడుల్లో మూడు రకాల తెలుగును మాట్లాడతారు, తెందెలుగు, నడుతెలుగు, వడతెలుగు. అదే మీ యత్త ఇందాక చెప్పింది' అని వివరించి చెప్పినాడు తాత"

PS: ఈ సైట్ dynamic fonts వాడుతోంది. Use the padma extension for Firefox or use IE.