Monday, August 21, 2006

ఎలుగుతోలు తెచ్చి...

ఈ article తమిళనాడులో ఉన్న తెలుగువారు, అక్కడ మాట్లాడే రకరకాల యాసలు - వీటి గురించి. ఇవి కాక, ఈ అయిదు పేజీల్లో ఉన్న nostalgia కోసమన్నా చదవొచ్చు. ఒక చిన్న excerpt:

"తరువాత ఎత్తయిన బృహదీశ్వరాలయ గోపురాన్ని చూస్తూ పొలం గట్ల మీద పోతున్నప్పుడు, 'అబయా! ఈ కావేటి నుంచి ఉత్తరంగా బయిదేలితే ఉత్తరపెన్న వరకూ మన గుంపు ఉండాది. ఉత్తరపెన్నకు ఉత్తరంగా, కావేటికి దక్షిణంగా మనవాళ్లు ఎవురూ ఉండరు. ఈ రెండు నదుల నడుమ భాగాన్ని మన పెద్దోళ్లు సౌకర్యం కోసం మూడు భాగాలు చేసుకొన్నారు. కావేటికీ దక్షిణ పెన్నకు నడాన ఉండేది తెన్నాడు అంటే దక్షిణదేశం. దక్షిణ పెన్నకు కుశస్థలికి నడానుండేది నడునాడు అంటే మధ్యప్రదేశ్, కుశస్థలికి ఉత్తరపెన్నకు నడానుండేది వడనాడు అంటే ఉత్తరదేశం. ఈ మూడునాడుల్లో మూడు రకాల తెలుగును మాట్లాడతారు, తెందెలుగు, నడుతెలుగు, వడతెలుగు. అదే మీ యత్త ఇందాక చెప్పింది' అని వివరించి చెప్పినాడు తాత"

PS: ఈ సైట్ dynamic fonts వాడుతోంది. Use the padma extension for Firefox or use IE.

3 Comments:

Blogger చదువరి said...

పొద్దున లేవంగానే http://www.telugubloggers.com లో మహాభారతం గురించిన మీ పోస్టు.. మీ బ్లాగుకొచ్చి, మిగతా జాబుల్నీ కూడా చూసాను. అందులో రమేశ్ గారి బ్లాగు గురించి చదివాను. http://www.telugupeople.com లో ఆయన బ్లాగు చూసాను. ఎంత అదృష్టం! ఇప్పటికైనా నేనా బ్లాగు చూడగలిగాను. ప్రళయకావేరి కథలు ఒకట్రెండు చదివాను. ఇక అక్కడ అన్నీ చదవొచ్చు. మంచి లింకిచ్చినందుకు థాంక్స్!

6:32 PM  
Anonymous Anonymous said...

mee blaagu low mee vyakti-gata vivaraalu kanipinchiTa laydu.

6:41 AM  
Anonymous Anonymous said...

ఒక చిన్న సూచన !

ఈ బ్లాగు పేరు కూడా తెలుగులోనికి అనువదించి టైటిల్ తెలుగులోనే కనిపించేలా చేస్తే బావుంటుంది కదా !

6:52 AM  

Post a Comment

<< Home