Thursday, August 24, 2006

మహిళలతోనే తెలుగు పదిలం

ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు రాసిన ఒక ఆలోచనాత్మకమైన వ్యాసం ఇది। వాడుక తెలుగు భాషకి అసలైన చిరునామా ఆడవాళ్లేనని ఆవిడ అభిప్రాయం। నిజమే,dsl మా అమ్మ, పెద్దమ్మలు, పిన్నులు వాడినన్ని తెలుగు పదాలు, సామెతలు మగవాళ్లు వాడగా నేను వినలేదు। వాళ్లు మాట్లాడే అంశాలు కూడా ఇందుకు ఒక కారణమే।ఇదే విషయాన్ని ఆవిడ ప్రముఖ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి మాటలను ఉదహరిస్తూ చక్కగా రాశారు।
"
ఒకప్పుడు ఆడవాళ్లు మాట్లాడే తెలుగుభాష అందంగా, అమృతప్రాయంగా ఉండేదనీ, సహజమైన నుడికారపు తెలుగును తాను ఆడవారి దగ్గరే నేర్చుకున్నాననీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వక్కణ। తన వ్యావహారిక భాషకు వాడీ వేడీ స్త్రీల పలుకుబడుల నుండే సంక్రమించాయంటారు ఆయన సగౌరవంగా - వారి 'అనుభవాలూ జ్ఞాపకాలూ' లో"

ఈ పుస్తకాన్ని నేను ఇదివరకే చదివాను। ఆనాటి సాంఘిక పరిస్థితులకి చక్కగా అద్దంపడుతూ, వ్యావహారిక, సంభాషణా తెలుగు భాష అంటే అమితమైన అభిమానం చూపించే ఒక తెలుగు రచయిత జీవిత గాథ అది।

పిల్లలు తల్లులతోటే తమ తొలినాళ్లు ఎక్కువ గడుపుతారు కాబట్టి, పిల్లలపై వారి భాష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం। అయితే, మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో తల్లులే సరైన తెలుగు మాట్లాడలేక పోతే, పిల్లలు ఇంకా త్వరగా మంచి భాషకి దూరమయ్యే అవకాశం ఎక్కువ। ఈ అభిప్రాయాన్ని వ్యాసం comments లో ఒకరు రాశారు।

ఇక వ్యాసంలో చివరగా ఆవిడ రాసిన వాక్యాలు
"
జాతీయమైన తెలుగుభాషను స్త్రీలు ప్రయోగించడమే కాదు, పరిరక్షించాలి కూడా! ఇప్పటికీ భాష, వేషం వారి చేత్లుల్లో చేతల్లో ఉన్నాయి కనుక। ప్రస్తుత తెలుగు స్త్రీలకు ఇది అతి ముఖ్యమైన బాధ్యత"

PS: ఈ సైట్ dynamic fonts వాడుతోంది. Use the padma extension for Firefox or use IE.

0 Comments:

Post a Comment

<< Home