Saturday, October 06, 2007
Thursday, October 04, 2007
Wednesday, October 03, 2007
Fwd: hi
hi
hi
Thursday, September 28, 2006
23 ఏళ్ల కల సాక్షాత్కారం... (ఈనాడు వార్త)
శ్రీమదాంధ్ర మహాభారతం ఆవిష్కారం
న్యూస్‌టుడే, తిరుమల
దాదాపు 23ఏళ్ల కల ఫలించి గ్రంథస్తరూపంలో సాక్షాత్కరించింది. సామాన్యులకు కూడా అర్థమయ్యేలా టీకా, తాత్పర్యాలు సహా మహాభారతాన్ని ముంద్రించాలన్న తితిదే లక్ష్యం నెరవేరింది. తితిదే ముద్రించిన శ్రీమదాంధ్రమహాభారతం గ్రంథాన్ని జాతికి అంకితం చేశారు. 18 పర్వాలతో కూడిన 15సంపుటిల మహాభారతం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అదీ కేవలం రూ.వెయ్యి ధరకే.
1983 నుంచి ఈ క్రతువు అనేక అవాంతరాలు అధిగమించి 2006లో పూర్తయింది. పోతన జయంతోత్సవాలను 1983లో వరంగల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తితిదే ఓ సావనీర్ వెలువరించింది. ఆ సందర్భంలోనే శ్రీమదాంధ్ర మహాభారతం గ్రంథాన్ని టీకా, తాత్పర్యాలు సహా వెలువరిస్తే ఉపయుక్తంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ బాధ్యతను తితిదే నిర్వర్తించాలని కూడా కోరారు. అందుకు తితిదే సముఖంగా స్పందించడంతో 1983లో ఈ క్రతువు ప్రారంభమైంది. ప్రముఖ పండితుడు దివాకర్ల వెంకటావధాని ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఆయన మరణానంతరం మహాభారత గ్రంథస్తానికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. మొదట ఆదిపర్వాన్ని మాత్రమే ముద్రించాలని నిర్ణయించారు. తర్వాత 18పర్వాలూ ముద్రించాలని నాగసిద్ధారెడ్డి హయాంలో నిర్ణయించారు. వివిధ కారణాలతో అడుగడుగునా ఆటంకాలు రావడంతో ఈ ప్రాజెక్టు చాలా జాప్యమైంది. ఎట్టకేలకు 2006లో పూర్తయింది. ఈ క్రతువులో 32మంది ప్రముఖ పండితులు పాలుపంచుకున్నారు. వారి శ్రమ ఫలించి 18 పర్వాల మహాభారతం 15సంపుటిల్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 70వేల పేజీలున్న ఈ గ్రంథాన్ని తితిదే కేవలం రూ.వెయ్యికే విక్రయిస్తుండటం అభినందనీయమే. రాజనీతే కాకుండా కుటుంబ బాంధవ్యాలు, మానవ సంబంధాల గురించి విపులంగా చర్చించిన మహాభారత గ్రంథం ప్రతీ ఇంటిలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
సీడీ రూపంలో కూడా...
మరింతగా జనవాళిలోకి తీసుకెళ్లాలంటే మహాభారతాన్ని సీడీ రూపంలోకి తీసుకురావాలని శ్వేత భావిస్తోంది. ఆ విధంగా చేస్తే ఉషశ్రీ రామాయణంలా మహాభారతాన్నీ మరింత జనరంజకంగా తీర్చిదిద్దగలమని తితిదే తలస్తోంది. ఇందుకోసం శ్వేత డైరెక్టర్ భూమన్ తితిదేకు ప్రతిపాదనలు సమర్పించారు. అనుమతి లభిస్తే మహాభారతాన్ని సీడీలుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం మొదలవుతుంది.
Thursday, September 07, 2006
నా జీవిత యాత్ర
"నాకు అతని స్నేహంవల్ల అలవాటయినవి బడి పిల్లలిని ఏడిపించడం, వాళ్ల పుస్తకాలు పారవెయ్యడం, ఉపాధ్యాయుల్ని వుడికించడం మొదలైన ఘనకార్యాలు!"
ఈ మాటలు ఎవరు రాశారనుకుంటున్నారు? ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు!
ఆయన 1942 లో క్విట్టిండియా ఉద్యమంలో కారాగారవాసం చేస్తూ రాసుకున్న "నా జీవిత యాత్ర" పుస్తకానికి 1972 లో అప్పటి భారత రాష్ట్రపతి వి.వి.గిరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ముందుమాటలు రాశారు.
ఈ స్వీయచరిత్ర archive.org లో దొరుకుతోంది. తప్పకుండా చదవండి!
ఇక్కడ download చేసుకోవచ్చు:
http://www.archive.org/details/NaaJeevitaYatraTanguturiPrakasham
Thursday, August 24, 2006
మహిళలతోనే తెలుగు పదిలం
"ఒకప్పుడు ఆడవాళ్లు మాట్లాడే తెలుగుభాష అందంగా, అమృతప్రాయంగా ఉండేదనీ, సహజమైన నుడికారపు తెలుగును తాను ఆడవారి దగ్గరే నేర్చుకున్నాననీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి వక్కణ। తన వ్యావహారిక భాషకు వాడీ వేడీ స్త్రీల పలుకుబడుల నుండే సంక్రమించాయంటారు ఆయన సగౌరవంగా - వారి 'అనుభవాలూ జ్ఞాపకాలూ' లో"
ఈ పుస్తకాన్ని నేను ఇదివరకే చదివాను। ఆనాటి సాంఘిక పరిస్థితులకి చక్కగా అద్దంపడుతూ, వ్యావహారిక, సంభాషణా తెలుగు భాష అంటే అమితమైన అభిమానం చూపించే ఒక తెలుగు రచయిత జీవిత గాథ అది।
పిల్లలు తల్లులతోటే తమ తొలినాళ్లు ఎక్కువ గడుపుతారు కాబట్టి, పిల్లలపై వారి భాష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం। అయితే, మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో తల్లులే సరైన తెలుగు మాట్లాడలేక పోతే, పిల్లలు ఇంకా త్వరగా మంచి భాషకి దూరమయ్యే అవకాశం ఎక్కువ। ఈ అభిప్రాయాన్ని వ్యాసం comments లో ఒకరు రాశారు।
ఇక వ్యాసంలో చివరగా ఆవిడ రాసిన వాక్యాలు
"జాతీయమైన తెలుగుభాషను స్త్రీలు ప్రయోగించడమే కాదు, పరిరక్షించాలి కూడా! ఇప్పటికీ భాష, వేషం వారి చేత్లుల్లో చేతల్లో ఉన్నాయి కనుక। ప్రస్తుత తెలుగు స్త్రీలకు ఇది అతి ముఖ్యమైన బాధ్యత"
PS: ఈ సైట్ dynamic fonts వాడుతోంది. Use the padma extension for Firefox or use IE.
Tuesday, August 22, 2006
హైదరాబాదు - వికిపీడియా
ఇందులో రాసిన కొన్ని interesting విషయాలు:
* హుస్సేన్ సాగర్ 1562 లో నిర్మించారు.
* నిజాముల ఏలుబడిలోని హైదరాబాదు, భారత్‌లోని అన్ని సంస్థానాల కంటే పెద్దది. ఇంగ్లండు, స్కాట్లండు ల మొత్తం వైశాల్యం కంటే పెద్దది.
* నగరం 100 వార్డులుగా విభజింపబడి ఉంది.
* హైదరాబాదు నగరానికి లోక్‌సభ లో రెండు సీట్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లో పదమూడు సీట్లు ఉన్నాయి.
కానీ references లేకపోవటం అనేది కొంచెం పెద్ద సమస్య. తెలుగు వికిపీడియాలో ఎక్కువమంది రాయకపోవటం వల్ల ఇలా జరుగుతోంది. ప్రతి చిన్న విషయానికీ reference పెడితే నమ్మకం పెరుగుతుంది. వికిపీడియాలో రాసే కొద్దిమందైనా అలా రాస్తే బాగుంటుంది.
టైపింగ్ తప్పులు కూడా చాలా ఉన్నాయి. వికీలు రాయకపోయినా, యూనికోడ్ తెలుగు టైప్ చెయ్యగలవాళ్లు కనీసం అప్పుడప్పుడూ తెలుగు వికిపీడియాలో ఇలాంటి తప్పులు ఏరిపారెయ్యటం, references పెట్టటం లాంటి పనులు చెయ్యాలి.
Monday, August 21, 2006
కాకతీయ యుగము
చాలా సరళమైన భాషలో ఉంటుంది.
ఇక్కడ download చేసుకోవచ్చు.
మన తెలుగు చరిత్రలో చెప్పుకోదగ్గ అతికొద్ది గొప్పసామ్రాజ్యాలలో కాకతీయులది చాలా ముఖ్యమైనది. అదీ కాక, కాకతీయులైన గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అందరికీ తెలిసినవాళ్లే.
చిన్న excerpt:
"కాకతీయుల గురించి ఎందుకు తెలుసుకోవాలి?
-----------------
1) కాకతీయులు తెలుగుదేశాన్ని సుమారు 325 సంవత్సరాలు (1000 AD - 1323 AD) పరిపాలించారు.
2) 225 BC - 225 AD మధ్యలో తెలుగుదేశాన్నే గాక దక్షిణాపథంలో విస్తారమైన భాగాన్ని పాలించిన శాతవాహనులకన్నా, 625 AD -1075 AD మధ్యలో వేంగీదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులకన్నా కాకతీయులు మనకు బాగా సన్నిహితులు."